కర్ణాటక మాజీ సీఎంలపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం అక్రమ గనుల తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ఎన్.ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామిల పాత్రపై విచారణ జరపాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ మార్చి 29న ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది. దీంతో బళ్లారి జిల్లాలో 11,797 చదరపు కిలో మీటర్ల అటవీ భూమిని డీ-రిజర్వ్ చేసిన విషయంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులతోపాటు మరికొందరు అధికారులపై విచారణ సాగనుంది. మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం. కృష్ణకు మాత్రం విచారణ నుంచి మినహాయింపు లభించింది.
ఎస్‌ఐగా నియమితులైన తొలి హిజ్రాతమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమెకు ధర్మపురి (తమిళనాడు)లో పోస్టింగ్ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రీతి పటేల్‌కు ప్రవాసీ సమ్మాన్ పురస్కారంభారత సంతతికి చెందిన బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్ మార్చి 27న ప్రవాసీ భారతీయ సమ్మాన్-2017 పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానంప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు రెండోస్థానం లభించింది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ బజ్‌ఫీడ్ నిర్వహించిన పోల్‌లో హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్ లివ్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాప్ గాయని బియాన్స్ మొదటిస్థానంలో నిలవగా ప్రముఖ మోడల్ టేలర్ హిల్ మూడోస్థానం దక్కించుకున్నారు.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కనుంగొ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా బి.పి. కనుంగో ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్న ఆయన కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ వంటి విభాగాలకు నాయకత్వం వహించనున్నారు.
హిందుస్తానీ గాయకురాలు అమోంకర్ మృతిప్రముఖ హిందుస్తానీ గాయకురాలు కిశోరీ అమోంకర్ (84) ఏప్రిల్ 3న ముంబైలో కన్నుమూశారు. 1932లో జన్మించిన అమోంకర్ గాయకురాలైన తన తల్లి మోగుబాయి కుర్దికర్ నుంచి తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ఆమె 1987లో పద్మభూషణ్, 2002లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.
ఈక్వెడార్ అధ్యక్షుడిగా లెనిన్ మారెనో ఈక్వెడార్ అధ్యక్షుడిగా పెయిస్ అలయెన్స్ పార్టీకి చెందిన లెనిన్ మారినో ఎన్నికయ్యారు. ఈ మేరకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లెనిన్‌కు 51.16 శాతం ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి గిల్లర్‌మో లాస్సో (కన్జర్వేటివ్ పార్టీ)కు 48.04 శాతం ఓట్ల వచ్చాయి.
లెనిన్ మారినో 2007 నుంచి 2013 వరకూ ఈక్వెడార్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రాజీవ్ కుమార్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ కుమార్ చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 4న విదేశీ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 1983 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్ 2006 నుంచి 2009 వరకు ఐరాసలో భారత మిషన్ డిప్యూటీ పర్మనెంట్ మెంబర్‌గా పనిచేశారు.

No comments:
Post a Comment