Friday, 1 December 2017

నవంబర్ 2017 వ్యక్తులు


తొలి మహిళా నేవీ పైలట్‌గా సుభాంగి స్వరూప్భారత నావికా దళంలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ పెలైట్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్ ఎంపికయ్యారు. మరో ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది. వీరు.. న్యూఢిల్లీకి చెందిన ఆస్తా సెహ్‌గల్, పుదుచ్చేరికి చెందిన ఎ. రూప, కేరళకు చెందిన ఎస్.శక్తిమాయ. నావికాదళంలోని నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టొరేట్ (NAI) విభాగంలో ఈ ముగ్గురూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేరళలోని కన్ననూర్ జిల్లాలో ఉన్న ఇండియన్ నావల్ అకాడెమీలో ఈ నలుగురు మహిళలు నావల్ ఓరియంటేషన్ పూర్తి చేసుకున్నారు. ఉమెన్ పైలట్‌గా సుభాంగి స్వరూప్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు. 


లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలతలోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహలతా శ్రీవాస్తవ నవంబర్ 28న నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనుంది. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా స్థానంలో స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు చేపడతారు. ఈమె పదవీ కాలం 2018 డిసెంబర్ 30న ముగియనుంది.


‘కొలిమి రవ్వలు’ పుస్తకం ఆవిష్కరణఇటీవల హత్యకు గురైన కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నవంబర్ 28న ఆవిష్కరించారు. గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.


ఎయిరిండియా కొత్త సీఎండీ ప్రదీప్ సింగ్ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నవంబర్ 28న నియమితులయ్యారు. ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రదీప్‌సింగ్ 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ చైర్మన్‌గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ నుంచి ప్రదీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.


విశ్వసుందరిగా డెమి-లేహ్ నెల్ పీటర్స్దక్షిణాఫ్రికా యువతి డెమి-లేహ్‌సెల్ పీటర్‌‌స(22) విశ్వసుందరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో 2017 నవంబర్ 26న జరిగిన తుది పోటీల్లో డెమి ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన శ్రద్ధ శశిధర్ 10వ స్థానంలో నిలిచారు.


15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఎన్‌కే సింగ్ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నవంబర్ 27న నియమితులయ్యారు. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం వంటి అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షించి అక్టోబర్ 2019 నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఈ కమీషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి తగినసిఫార్సులు చేస్తుంది.
కమీషన్‌లో మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు సభ్యులుగా ఉంటారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు సంబంధించిన 14వ ఫైనాన్స్ కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయింది.

ఆసియా సంపన్నుల్లో తొలి స్థానంలో ముకేశ్ కుటుంబంఫోర్బ్స్ పత్రిక విడుదల ఆసియా టాప్ - 50 సంపన్న కుటుంబాలు - 2017 జాబితాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ తొలి స్థానంలో నిలిచింది. ఈ కుటుంబం తాలూకు సంపద విలువ 19 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఏకంగా 44.8 బిలియన్ డాలర్లకు ఎగిసింది. శాంసంగ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొరియాకు చెందిన లీ కుటుంబం 40.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాక్ కుటుంబం 40.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. వీరి నికర సంపద విలువ 40.4 బిలియన్ డాలర్లు. 


మానుషి ఛిల్లర్‌కు మిస్ వరల్డ్ - 2017 టైటిల్ హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించింది. చైనాలోని సాన్యా నగరంలో నవంబర్ 18న నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని ైకైవసం చేసుకుంది. ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది. 
2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. 
బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ.. మిస్ వర్డల్ - 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు.
భారత్‌కు 6 మిస్‌వరల్డ్ టైటిల్స్ మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు.
భారత్‌కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. 
 

వెయిట్‌లిఫ్టర్ సులేమాన్ ఒగ్లు కన్నుమూత ఏడుసార్లు విశ్వవిజేత... వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్... టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ నైమ్ సులేమాన్‌ఒగ్లు అనారోగ్యంతో నవంబర్ 18న కన్నుమూశారు. కేవలం 4.8 అడుగుల ఎత్తుండే సులేమాన్ ఒగ్లును వెయిట్‌లిఫ్టింగ్ ప్రపంచంలో ‘ద పాకెట్ హెర్క్యూలెస్’గా పిలుస్తారు. 
1988 సియోల్ (60 కేజీలు), 1992 బార్సిలోనా (60 కేజీలు), 1996 అట్లాంటా (64 కేజీలు) ఒలింపిక్స్ క్రీడల్లో ఆయన స్వర్ణ పతకాలు గెలిచారు. తన శరీర బరువుకు 2.5 రెట్లు బరువునెత్తిన తొలి, ఏకై క వెయిట్ లిఫ్టర్ ఆయనే. 22 ఏళ్లకే 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆయన 2000లో సిడ్నీ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నారు.

యూనిసెఫ్ బాలల హక్కుల ప్రచారకర్తగా త్రిష తమిళ సినీ నటి త్రిష ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) సెలబ్రిటీ అడ్వకేట్‌గా వ్యవహరించనున్నారు. బాలల హక్కులు, వారి సమస్యలపై త్రిష ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారని నవంబర్ 20న యూనిసెఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలు, పిల్లల్లో రక్తహీనత, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై అకృత్యాలు తదితర సమస్యలపై పోరాటంలో త్రిష భాగస్వాములవుతారని యూనిసెఫ్ ఉన్నతాధికారి జాబ్ జకారియా చెప్పారు. కుటుంబాల్లో, సామాజిక వర్గాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చిన్నారుల హక్కులకు భంగం వాటిల్లిన సందర్భాల్లో ఆమె క్రియాశీలంగా వ్యవహరిస్తారని జకారియా చెప్పారు. యూనిసెఫ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తొలి దక్షిణభారత నటి త్రిషనే. 


దాతృత్వ నెట్‌వర్క్‌లోకి నీలేకని దంపతులుఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి నీలేకని తాము సైతం సమాజ సేవకు సంపదను ధారపోస్తామంటూ ముందుకొచ్చారు. తమ సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తుల సమూహం ‘ద గివింగ్ ప్లెడ్‌‌జ’లో నీలేకని దంపతులు చేరారు. ఇందుకు సంబంధించి అంగీకారం తెలుపుతూ నీలేకని రాసిన లేఖను ద గివింగ్ ప్లెడ్‌‌జ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. 
గివింగ్ ప్లెడ్‌‌జను బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా, వారెన్ బఫెట్ కలసి 2010లో ఏర్పాటు చేశారు. అధిక ధనవంతులను దాతృత్వం దిశగా ప్రోత్సహించేందుకు ఇది ఏర్పాటయింది. ఈ నెట్‌వర్క్‌లో మన దేశం నుంచి విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, శోభా డెవలపర్స్ ఎమిరటస్ చైర్మన్ పీఎన్‌సీ మీనన్ ఇంతకుముందే చేరగా, వీరి బాటలోనే నీలేకని దంపతులు నిర్ణయం తీసుకున్నారు.


ఐసీజే న్యాయమూర్తిగా మళ్లీ ఎన్నికైన భండారి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ నుంచి నవంబర్ 21న బ్రిటన్ (అభ్యర్థి క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్ ) తప్పుకోగా.. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, భద్రతా మండలిలు భండారీకి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ అతి పెద్ద దౌత్య విజయం సాధించినటై్లంది. ఐరాస సాధారణ సభలో మొత్తం 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లనూ భండారీ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఆయన మరో 9 ఏళ్ల కాలానికి ఐసీజే న్యాయమూర్తిగా పనిచేయనున్నారు. హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుండగా.. ప్రతీ మూడేళ్లకు ఐదుగురిని ఎన్నుకుంటారు. 
2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్‌‌స అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది. 


బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రీతి రాజీనామాబ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో నవంబర్ 8న ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది.
 

‘నాడా’ అప్పీల్ ప్యానెల్‌లో సెహ్వాగ్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికయ్యాడు. క్రికెట్‌ను కూడా ‘నాడా’ పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సెహ్వాగ్‌తో పాటు డిల్లీ మాజీ క్రికెటర్ వినయ్ లాంబా తదితరులు ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఉన్నారు. అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్- ఏడీడీపీ)ని కూడా ‘నాడా’ నియమించింది. ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. 2001లో డోపింగ్ కారణంగా ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన వెయిట్ లిఫ్టర్ కుంజరాణికి ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించారు. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్‌పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు.


నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తొలి మహిళ.. ఘోష్. ఆమె ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండీగా పనిచేశారు. నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఘోష్ సభ్యురాలు కాగా.. నాస్కామ్ ఫౌండేషన్ ట్రస్టీగా కూడా ఉన్నారు. 
దేశీ ఐటీ, బీపీవో రంగం ప్రస్తుతం 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 

భార్యను కలిసేందుకు జాధవ్‌కు అనుమతి భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్‌లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది. 

యునెస్కోకి రెండోసారి మహిళాధిపతి ‘ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో)’ నూతన డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఫ్రాన్స్ సాంస్కృతిక, సమాచార శాఖ మాజీ మంత్రి ఆద్రే అజోలే నియమితులయ్యారు. ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను యునెస్కో సర్వ సభ్య సదస్సు నవంబర్ 12న ఆమోదించింది. యునెస్కోకి 11వ డీజీగా నియమితులైన అజోలే ఈ పదవిని అలంకరించనున్న రెండో మహిళ కావడం గమనార్హం. ఈమె ఇరినా బొకోవా స్థానంలో నియమితులయ్యారు.

పాక్‌లో భారత హైకమిషనర్‌గా అజయ్ బిసారియా 
పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా 1987 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అజయ్ బిసారియా నియమితులయ్యారు. పాక్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న గౌతమ్ బంబావలే ఇటీవల చైనా రాయబారిగా వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అజయ్‌ను నియమించింది. ప్రస్తుతం అజయ్ పోలెండ్‌లో భారత రాయబారిగా ఉన్నారు. 


ఆసియా కుబేరుడుగా అవతరించిన ముకేశ్ రిలయన్‌‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చైనాకు చెందిన హు కా యాన్‌ను అధిగమించి ఆసియా కుబేరుడిగా అవతరించారు. ఆర్‌ఐఎల్ షేరు ధర నవంబర్ 1న 1.22 శాతం పెరగడంతో ముకేశ్ వ్యక్తిగత సంపద విలువ ఒక్కరోజే 466 మిలియన్ డాలర్ల మేర (రూ.3,000) పెరిగింది. దీంతో 42.1 బిలియన్ డాలర్ల సంపద విలువతో (రూ.2.7 లక్షల కోట్లు) ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. చైనా ఈవర్‌గ్రాండ్ గ్రూపు చైర్మన్ హు కా యాన్ సంపద నవంబర్ 1 నాటికి నాటికి 1.28 బిలియన్ డాలర్ల మేర తగ్గి 40.6 బిలియన్ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్లు) కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముకేశ్ అంబానీ 14వ స్థానంలో ఉన్నారు. 


దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్‌గా సురేష్ చుక్కపల్లి హైదరాబాద్‌లో దక్షిణ కొరియా గౌరవ కాన్సుల్ జనరల్‌గా ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ విదేశాంగ శాఖ నవంబర్ 1న ఒక ప్రకటన వెలువరించింది. గతంలో ఈయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
 

ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో ఐదుగురు భారతీయులుఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో జర్మనీ చాన్‌‌సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె ఈ స్థానాన్ని దక్కించుకోవటం ఇది 12వ సారి. వరుసగా ఏడోసారి.
మెర్కెల్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా యూకే ప్రధాని థెరెసా మే, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ నిలిచారు. ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 4వ స్థానంలో, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా ఐదో స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన పెప్సికో సీఈవో ఇంద్రా నూయి 11వ స్థానం, ఇండో-అమెరికన్ నిక్కీ హేలీ 43వ స్థానంలో ఉన్నారు. జాబితాలో కొత్తగా 23 మంది స్థానం దక్కించుకోగా, అందులో ఇవాంకా ట్రంప్ (19వ స్థానం) కూడా ఉన్నారు. 
ఈ జాబితాలో బారత్ నుంచి ఐదుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ అగ్రస్థానం (మొత్తంగా 32వ స్థానం) లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో హెచ్‌సీఎల్ కార్ప్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా (57), బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (71) హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్, ఎడిటోరియల్ డెరైక్టర్ శోభన భర్తియా (92) బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (97) ఉన్నారు.
టాప్ 10 శక్తిమంతమైన మహిళలు
శక్తిమంతమైన భారత మహిళలు
ర్యాంక్
పేరు
పేరు
ర్యాంక్
1
ఏంజెలా మెర్కెల్
చందా కొచ్చర్
32
2
థెరెసా మే
రోష్ని నాడార్ మల్హోత్రా
57
3
మిలిండా గేట్స్
కిరణ్ మజుందార్ షా
71
4
షెరిల్ శాండ్‌బర్గ్
శోభన భర్తియా
92
5
మేరీ బర్రా
ప్రియాంక చోప్రా
97
6
సుసన్ వోజిస్కీ
7
అబిగెయిల్ జాన్సన్
8
క్రిస్టినా లగార్డే
9
అనా ప్యాట్రిసియా బోటిన్
10
గిన్నీ రోమెట్టీ



మహమ్మద్ అలీ జిన్నా కూతురు కన్నుమూతపాకిస్థాన్ నిర్మాత మహమ్మద్ అలీ జిన్నా కూతురు దీనా వాడియా (99) నవంబర్ 3న అమెరికాలో కన్నుమూశారు. వాడియా గ్రూపు చైర్మన్ నుస్లీ వాడియా ఆమె కుమారుడు. దీనా తన తండ్రితో విభేదించి వాడియాను పెళ్లి చేసుకొని తండ్రికి దూరంగా ఉన్నది. 


తెలుగులో ‘హిట్ రీఫ్రెష్’మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రాసిన ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకం తెలుగులో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ భాషల్లోనూ ఈ పుస్తకంను అనువదించారు.‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతర అనుభవాలను నాదెళ్ల వివరించారు. పుస్తక ప్రచారం నిమిత్తం భారత్‌కు వచ్చిన నాదెళ్ల నవంబర్ 6న హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.


కర్ణాటకకు తొలిసారి మహిళా డీజీపీ 
కర్ణాటక తొలి మహిళా డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా నీలమణి రాజు అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టారు. 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆమె ఈ పదవిలో 2020 జనవరి వరకు ఉంటారు. నీలమణి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ.

అక్టోబర్ 2017 వ్యక్తులు

పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌పై అరెస్టు వారంట్అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అరెస్టు వారంట్ జారీ అయ్యింది. పనామా పేపర్ల కుంభకోణంతో పదవి కోల్పోయిన షరీఫ్‌ను అవినీతి ఆరోపణలపై అక్కడి అకౌంటబిలిటీ కోర్టు విచారణ చేస్తోంది. కోర్టు విచారణకు షరీష్ పలుమార్లు హాజరు కాకపోవడంతో అక్టోబర్ 26న ఆయనపై న్యాయస్థానం బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను జారీచేసింది. 


మిస్ వర్జీనియాగా హిమాన్విభారత సంతతికి చెందిన పనిదెపు హిమాన్వి(17)ని మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్ వరించింది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి ఇండియన్ అమెరికన్‌గా హిమాన్వి నిలిచింది. క్లిఫ్టన్లోని సెంట్రెవిల్లె హైస్కూల్లో చదువుకుంటున్న హిమాన్వి... 39 మంది యువతులతో పోటీపడి ఈ అందాల కిరీటాన్ని చేజిక్కించుకుంది. డౌన్ టౌన్ నార్ఫోక్‌లోని టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలోని రోపర్ థియేటర్‌లో మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్‌ను హిమాన్వికి బహూకరించారు. మానసిక ఆరోగ్యం, డ్రగ్‌‌స, ఆల్కహాల్‌లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హిమాన్వి తనవంతుగా కృషి చేస్తున్నారు. 


బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో జెఫ్ బెజోస్‌కు అగ్రస్థానంఅంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు సవరించిన జాబితాను బ్లూమ్‌బర్గ్ అక్టోబర్ 29న ప్రకటించింది. జాబితాలో బేజోస్ 9,380 కోట్ల డాలర్ల ఆస్తితో మొదటి స్థానంలో నిలవగా, 8,870 కోట్ల డాలర్ల సంపదతో బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు. బిల్‌గేట్స్ కంటే బేజోస్ ఆస్తి 510 కోట్ల డాలర్లు అధికం. ఈ జాబితాలో 2013 సంవత్సరం నుంచి బిల్‌గేట్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 


బీసీసీఐ మాజీ జీఎం ఎంవీ శ్రీధర్ మృతిభారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్‌‌స), హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మాటూరి వెంకట శ్రీధర్ మృతి చెందారు. అక్టోబర్ 30న గుండెనొప్పితో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్ను మూశారు.
1966 ఆగస్టు 2న విజయవాడలో జన్మించిన ఎంవీ శ్రీధర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1988లో హైదరాబాద్ రంజీ జట్టు తరఫున తొలిసారి ఆడారు. 2000లో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కెరీర్‌లో 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శ్రీధర్ 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో మొత్తం 6,701 పరుగులు సాధించారు.
2000 నుంచి 2006 వరకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శిగా, 2010 నుంచి 2012 వరకు ఉపాధ్యక్షుడిగా, 2012 నుంచి 2014 వరకు కార్యదర్శిగా పనిచేశారు. 2010-2011 సీజన్‌లో హైదరాబాద్ రంజీ జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. 2013లో బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్‌‌స జనరల్ మేనేజర్ (జీఎం)గా నియమితులై 2017 సెప్టెంబర్ 27 వరకు కొనసాగారు.


ఎన్‌ఐఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మోదీజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేశ్ చందర్ మోదీ అక్టోబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో కొనసాగిన శరద్‌కుమార్ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మోదీని నియమించింది. ఆయన 2021 మే 31 వరకు పదవిలో కొనసాగుతారు.


న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్ అక్టోబర్ 26న వెల్లింగ్టన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈమె న్యూజిలాండ్‌కు మూడో మహిళా ప్రధాని కాగా, గత 150 ఏళ్లలో ప్రధానైన అతి పిన్న వయస్కురాలు.

కశ్మీర్ చర్చల దూతగా దినేశ్వర్ శర్మకశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వ దూతగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 24న ప్రకటించారు.

సొలిసిటర్ జనరల్ రంజిత్ రాజీనామా సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ అక్టోబర్ 20న తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రంజిత్ తన రాజీనామా లేఖను న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కార్యాలయానికి పంపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన రంజిత్ మూడేళ్ల పాటు పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. వాటిలో నోట్లరద్దు, కాలుష్యం పెరుగుదలకు సంబంధించిన కేసులున్నాయి. 


సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌గా రాకేశ్ ఆస్థానా నిఘా, భద్రత, దర్యాప్తు విభాగాల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22న కీలక మార్పులు చేసింది. ఐపీఎస్ అధికారులు రాకేశ్ ఆస్థానాను సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌గా, గుర్బాచన్ సింగ్‌ను ఇంటెలిజెన్‌‌స బ్యూరో ప్రత్యేక డెరైక్టర్‌గా, సుదీప్ లఖ్తాకియాను సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజేశ్ రంజన్, ఏపీ మహేశ్వరిలకు బీఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక డెరైక్టర్ జనరళ్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

కశ్మీర్‌పై చర్చలకు మధ్యవర్తిగా ఐబీ మాజీ డెరైక్టర్ జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్‌‌స బ్యూరో(ఐబీ) మాజీ డెరైక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది. ఈ మేరకు అక్టోబర్ 23న హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు. 
1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దినేశ్వర్ శర్మ 2014 నుంచి 2016 వరకూ ఇంటెలిజెన్‌‌స బ్యూరో డెరైక్టర్‌గా పనిచేశారు.
 

పోస్టల్ బ్యాంక్ సీఈఓగా సురేష్ సేథీఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)కు కొత్త సీఈవోగా సురేష్ సేథీ నియమితులయ్యారు. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి సీఈవోగా పనిచేస్తున్న ఏపీ సింగ్ స్థానంలో సేథీ నియమితులయ్యారు. సేథీ వోడాఫోన్ ఎం- పెసాకు ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ సేథీకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల్లో 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 


చైనా మోస్ట్ పాపులర్ నేతగా జిన్‌పింగ్ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జిన్‌పింగ్‌కు దిగ్గజ గౌరవాన్ని కల్పిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) అక్టోబర్ 24న తీర్మానం చేసింది. జిన్‌పింగ్ పేరును, ఆయన సిద్ధాంతాలను సీపీసీ రాజ్యాంగంలో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెంట్రల్ కమిటీకి ఎన్నికవడంతో రెండోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జిన్‌పింగ్‌కు లాంఛనమే. అయితే మావో తరహాలో మూడోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టేలా ఆయన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. 
కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున జిన్‌పింగ్ సిద్ధాంతాలను రాజ్యాంగంలో చేరుస్తూ సీపీసీ ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్‌కు ముఖ్యనేత(కోర్ లీడర్) స్థాయిని ప్రకటించింది. దీంతో ఇకపై పార్టీలోని నేతలందరికంటే అత్యున్నత స్థాయిలో జిన్‌పింగ్ ఉంటారు. ఇప్పటి వరకూ మావోతో పాటు మాజీ అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ ఆలోచనలకు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగంలో చోటు దక్కింది. 


ప్రముఖ గాయని గిరిజా దేవి మృతి ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని గిరిజా దేవి (88) అక్టోబర్ 24న కోల్‌కతాలో కన్నుమూశారు. ‘క్వీన్ ఆఫ్ తుమ్రీ’గా ఆమె ప్రసిద్ధికెక్కారు. బనారస్ ఘరానాకు చెందిన ఈ గాయనికి 1972లో పద్మశ్రీ, 1989లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. 


మాల్టా పాత్రికేయురాలు గలిజియా హత్యపనామా పత్రాలతోపాటు పలు పరిశోధనాత్మక కథనాలతో మాల్టాలో ప్రకంపనలు సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు డాఫ్నే కరువానా గలిజియా(53) దారుణ హత్యకు గురయ్యారు. మాల్టాలోని బిద్నిజా ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బాంబుదాడికి గురైంది. ఈ ఘటనను ఆ దేశ ప్రధాని జోసెఫ్ మస్కట్ తీవ్రంగా ఖండించారు.

కృష్ణా బోర్డు కొత్త సభ్య కార్యదర్శిగా ఎ.పరమేశం సమీర్ చటర్జీ స్థానంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కొత్త సభ్య కార్యదర్శిగా పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్ అండ్ డిజైనింగ్ చీఫ్ ఇంజినీర్ ఎ.పరమేశం నియమితులయ్యారు. బోర్డు పక్షపాత ధోరణిని నిరసిస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి సమీర్ చటర్జీని తొలగించింది. ఆయన స్థానంలో ఎ.పరమేశంను నియమించింది. అలాగే బోర్డులో కొత్తగా హరికేశ్ మీనాను సభ్యుడిగా నియమించారు. 


లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ తెలంగాణ, ఏపీలకు లోకాయుక్తగా వ్యవహరిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి అక్టోబర్ 11న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు సన్మానం చేశారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కొత్త లోకాయుక్త నియామకానికి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఉప లోకాయుక్త గంగిరెడ్డి లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 


ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(62) పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అక్టోబర్ 11న ప్రకటించింది. 
ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పనిచేసిన గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్ ఖేర్‌ను చైర్మన్‌గా నియమించింది. ఖేర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించారు. సినిమా, కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 


యూఎస్‌ఐబీసీ అధ్యక్షురాలిగా నిషా దేశాయ్ బిస్వాల్ యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ - USIBC అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అమెరికన్ నిషా దేశాయ్ బిస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు యూస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ 11న ప్రకటించింది. నిషా బిస్వాల్.. 2013-2017 వరకు అమెరికా ప్రభుత్వంలో దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలోనే భారత్ - అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, వ్యాపార చర్చల్లో కీలక పాత్ర పోషించారు. 
భారత్, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం యూస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్‌ను 1975లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, అమెరికాలోని 350కిపైగా అత్యుత్తమ కంపెనీలు సభ్యత్వం కలిగి ఉంటాయి. 


ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చిన న్యాయస్థానం తొమ్మిదేళ్ల క్రితం సంచలన రేపిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమ్‌రాజ్ హత్య కేసుల్లో అలహాబాద్ హైకోర్టు అక్టోబర్ 12న కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో కింది కోర్టు దోషులుగా తేల్చిన ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ తల్వార్‌లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సమర్పించిన ఆధారాలు వారిద్దరిని దోషులుగా నిర్ధారించేందుకు సరిపోవని తేల్చింది. 
ఆరుషి, హేమ్‌రాజ్ హత్యకేసుల్లో 2013లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు నుపుర్, రాజేశ్‌లకు జీవిత ఖైదు విధించింది. 

ప్రణబ్ పుస్తకం ‘కొలిషన్ ఇయర్స్’ ఆవిష్కరణ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘కొలిషన్ ఈయర్స్(సంకీర్ణ సంవత్సరాలు) 1996-2012’ పుస్తకావిష్కరణ అక్టోబర్ 13న జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్.. 2004లో ప్రధాని అయ్యేందుకు తనకన్నా, నాటి తన మంత్రివర్గ సహచరుడు ప్రణబ్ ముఖర్జీకే ఎక్కువ అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 


భారత తొలి ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్ మృతి ఒలింపిక్స్ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన తొలి స్విమ్మర్ మెహబూబ్ షంషేర్ ఖాన్ అక్టోబర్ 15న గుంటూరులో కన్నుమూశారు. 87 ఏళ్ల షంషేర్ ఖాన్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి గ్రామానికి చెందిన షంషేర్ ఖాన్ 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బ్రెస్ట్‌ో్టక్ ్ర(హీట్స్‌లో ఐదో స్థానం), 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ (హీట్స్‌లో ఆరో స్థానం) ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. 
మరిన్ని వివరాలు... 
  • 1930 ఆగస్టు 2వ తేదీన జన్మించిన షంషేర్ ఖాన్ ఎలాంటి కోచ్‌లు, సదుపాయాలు లేకుండానే కృష్ణానదిలో ఈత నేర్చుకున్నారు.
  • 16 సంవత్సరాల వయస్సులో 1946లో బెంగళూరులోని సదరన్ కమాండ్‌లో ఆర్మీలో చేరారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉండటంతో ఈతలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు.
  • 1954 నుంచి వరుసగా మూడుసార్లు సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచారు.
  • మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆర్మీలో రకరకాల విధుల కారణంగా స్విమ్మింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. 1962లో ఆయన అసోంకు బదిలీ అయ్యారు. అక్కడ చైనా బోర్డర్ వరకు రోడ్డు వేసే పనిలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1973లో సుబేదార్ హోదాలో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక కొన్నేళ్ల పాటు సికింద్రాబాద్ ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేసి స్వగ్రామానికి వచ్చారు.


అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షునిగా కేశవులు అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కె.కేశవులు ఎంపికయ్యారు. ఈ సలహామండలిలో 8 మంది ఓఈసీడీ, ఇస్టా, ఐఎస్‌ఎఫ్ వంటి అంతర్జాతీయ విత్తన సంస్థల అధికారులు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సలహా మండలి విత్తన పరిశ్రమ అవసరాలు, పరిశోధన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ విత్తన నాణ్యత, అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులు, నియమ నిబంధనల రూపకల్పన తదితర విషయాలలో కీలక పాత్ర పోషించనుంది. డాక్టర్ కేశవులు నియామకంతో దేశీయంగా విత్తన పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయడం, విత్తన రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల మధ్య సమతుల్యత సాధించడం సులభతరమవుతుంది. 


శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుందన్న కేరళ హైకోర్టు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేస్ బౌలర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన నిషేధం కొనసాగుతుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2013-ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో నిందితుడైన 34 ఏళ్ల శ్రీశాంత్ బోర్డు నిషేధాన్ని కోర్టులో సవాలు చేశాడు. ఆగస్టు 7న సింగిల్ జడ్జి బెంచ్ అతడిని నిర్దోషిగా తేల్చింది. అయితే దీనిపై బీసీసీఐ హైకోర్టుకు వెళ్లింది. అక్టోబర్ 17న ఈ కేసును చీఫ్ జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్, జస్టిస్ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, నిషేధాన్ని కొనసాగిస్తూ బీసీసీఐకి అనుకూలంగా తీర్పునిచ్చింది. 


పాక్ క్రికెటర్ ఖలీద్ లతీఫ్‌పై ఐదేళ్ల నిషేధం 
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో పాటు రూ. 1 మిలియన్ (పాక్ కరెన్సీ) జరిమానా కూడా విధించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చెందిన అవినీతి వ్యతిరేక కోడ్‌లోని ఆరు నిబంధనలను లతీఫ్ అతిక్రమించినట్టు యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. దీంతో లతీఫ్‌పై పీసీబీ ఈ మేరకు చర్య తీసుకుంది. ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో లతీఫ్ స్పాట్ ఫిక్సంగ్‌కు పాల్పడినట్టు పీసీబీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ నిషేధంపై అప్పీల్ చేసుకునేందుకు లతీఫ్‌కు 14 రోజుల గడువునిచ్చారు. ఇదే ఆరోపణలతో ఇంతకుముందే టెస్టు ఓపెనర్ షర్జీల్ ఖాన్‌పై కూడా ఐదేళ్ల నిషేధం విధించినా ఆ తర్వాత దాంట్లో సగం కాలాన్ని సస్పెండ్ చేశారు. 


ఎస్‌బీఐ కొత్త చైర్మన్ రజనీష్ కుమార్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్‌గా రజనీష్ కుమార్ (59) అక్టోబర్ 4న నియమితులయ్యారు. ఆక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. ప్రస్తుత చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలో రజనీష్‌ని నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.
రజనీష్ 2015 మే 26న ఎస్‌బీఐ బోర్డులో చేరారు. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా ఉన్నారు. అంతకు ముందు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ, బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్ ఫైనాన్‌‌స అండ్ లీజింగ్ స్ట్రాటెజిక్ బిజినెస్ యూనిట్)గా, బ్రిటన్, కెనడా విభాగాల్లోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు. 
అరుంధతీ భట్టాచార్య తొలిసారిగా 2013లో బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఈ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.


ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబర్ 5న ఆగ్రాలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచుతూ ఎస్పీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో అఖిలేష్ ఈ పదవిలో ఐదేళ్లు కొనసాగుతారు.


భారత్‌లో అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఇండియాలోని వంద మంది బిలియనీర్ల జాబితా-2017’లో రిలయన్‌‌స ఇండస్ట్రీస్ చీఫ్ ముకేష్ అంబానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు రూ.2.5 లక్షల కోట్ల (38 బిలియన్ డాలర్లు) నికర సంపద విలువతో వరుసగా పదోసారి మొదటిస్థానంలో నిలిచాడు. దీంతో ఆయన ఆసియాలోని టాప్-5 కుబేరుల్లో కూడా ఒకరిగా నిలిచారు. తాజా జాబితాలో ఉన్నవారి మొత్తం సంపద విలువ 26 శాతం వృద్ధితో రూ.31 లక్షల కోట్లకుపైగా (479 బిలియన్ డాలర్లు) పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది.
నివేదిక ముఖ్యాంశాలు
  • గతేడాది రెండో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా) ఈ సారి తొమ్మిదో స్థానానికి పడిపోయారు. ఆయన సంపద విలువ 12.1 బిలియన్ డాలర్లు.
  • ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీకి 3.15 బిలియన్ డాలర్లతో 45వ స్థానం.
  • అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీకి 11 బి. డాలర్లతో పదో స్థానం.
  • ఆచార్య బాలకృష్ణకు (పతంజలి ఆయుర్వేద్) రూ.43,000 కోట్ల (6.55 బిలియన్ డాలర్లు)తో 48వ స్థానం
  • నుస్లీ వాడియాకి (జాబితాలో కొత్తగా స్థానం పొందారు) 5.6 బిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానం
  • వెటరన్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీకి 9.3 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానం
  • ఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీకి 2.75 బిలియన్ డాలర్లతో 55వ స్థానం
  • ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలకు స్థానం

భారత్‌లో టాప్-10 ధనవంతులు
స్థానం
పేరు
సంపద


బిలియన్ డాలర్లు
రూపాయలు (కోట్లు)
1.
ముకేశ్ అంబానీ
38
2,48,102
2.
అజీమ్ ప్రేమ్ జీ
19
1,24,051
3.
హిందుజా సోదరులు
18.4
1,20,133
4.
లక్ష్మీ మిట్టల్
16.5
1,07,728
5.
పల్లోంజి మిస్త్రీ
16
1,04,464
6.
గోద్రేజ్ కుటుంబం
14.2
92,711
7.
శివ్ నాడార్
13.6
88,794
8.
కుమార బిర్లా
12. 6
82,265
9.
దిలీప్ సంఘ్వీ
12.1
79,000
10.
గౌతమ్ అదానీ
11
71,819

ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 7.5 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో ఉన్నారు.

టాప్-100 లో మహిళా బిలియనీర్లు
స్థానం
పేరు
సంపద (బిలియన్ డాలర్లలో)
16
సావిత్రి జిందాల్
7.5
40
గుప్తా కుటుంబం
3.45
48
వినోద్&అనిల్ రాయ్ గుప్తా
3.11
51
జైన్ కుటుంబం
3
63
అమాల్గమేషన్‌‌స గ్రూప్
2.5
71
లీనా తివారీ
2.19
72
కిరణ్ మజుందార్ షా
2.16


అరుంధతీ భట్టాచార్య పదవీ విరమణఎస్‌బీఐ చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్ అయిన అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 6న పదవీ విరమణ చేశారు. ఆమె 2013లో ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.

తమిళ హీరో జై డ్రైవింగ్ లెసైన్స్‌రద్దు తమిళ సినీ నటుడు జై డ్రైవింగ్ లెసైన్స్‌ను చెన్నైలోని సైదాపేట కోర్టు 6 నెలల పాటు రద్దు చేసింది. సెప్టెంబర్ 21న మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ అడయారు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గోడను ఢీకొన్న కేసులో ట్రాఫిక్ పోలీసులు జైపై చార్జిషీట్ దాఖలు చేశారు. అక్టోబర్ 3న కోర్టులో చార్జిషీట్ నకలును పొందిన జై ఆ తరువాత విచారణకు హాజరు కాకపోవడంతో మేజిస్ట్రేట్ అతనిపై అరెస్ట్ వారెంట్ జారీచేశారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు జై కోర్టులో అంగీకరించారు. సినిమాల్లోలా ప్రవర్తించరాదని జైకి హితవు పలికి రూ.5,200 అపరాధ రుసుము విధించిన కోర్టు ఆరు నెలల పాటు ఆయన డ్రైవింగ్ లెసైన్‌‌సను రద్దుచేసింది.

బీబీసీ శక్తిమంతమైన మహిళల్లో మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ‘బీబీసీ’ రూపొందించిన అత్యంత శక్తిమంతమైన భారత మహిళల జాబితాలో నిలిచింది. బీబీసీ విడుదల చేసిన ఈ టాప్-100 ప్రభావవంతమైన మహిళల్లో ఆమె స్థానం సంపాదించింది. భారత్‌కే చెందిన రచయిత్రి, యోగా గురువు ఐరా త్రీవేదీ, తీహార్ జైళ్లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న తులికా కిరణ్, ఎంబైబ్ సంస్థ సీఈవో అదితి అవస్థి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహ్రూనిసా సిద్ధిఖీ, మహిళా ఉద్యమకారిణి డాక్టర్ ఊర్వసి సాహ్ని, బిజినెస్ ఎనలిస్ట్ నిత్యా తుమ్మలచెట్టి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 
అక్టోబర్‌లో ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి. 


ఫోర్బ్స్ అత్యధిక సంపాదకుల జాబితాలో ప్రియాంకప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్థానం దక్కించుకున్నారు. రూ.65.52కోట్ల పారితోషికం తీసుకుంటూ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో ప్రియాంకా ఎనిమిదో స్థానంలో నిలిచారు. ‘క్వాంటికో’ టీవీ షోతో పశ్చిమదేశాల్లో వినోద రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంకా.. ‘బేవాచ్’ సినిమాతో హాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. 
రూ.271.85కోట్ల ఆర్జనతో కొలంబియా నటి సోఫియా వెర్గారా వరుసగా ఆరో ఏడాదీ టాప్-10లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ నటి కేలీ కుకో రూ.170.39 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. గ్రేస్ అనాటమీ నటీమణి ఎలెన్ పోంపియో రూ.85 కోట్ల సంపాదనతో మూడో స్థానం దక్కించుకున్నారు. 


‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హెఫ్నర్ కన్నుమూతప్రముఖ మ్యాగజైన్ ‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ మృతి చెందారు. సెప్టెంబర్ 28న స్వగృహంలో హెఫ్నర్ కన్నుమూసినట్లు ప్లేబాయ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 1926 ఏప్రిల్ 9న షికాగోలో జన్మించిన హెఫ్నర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1944-1946 మధ్య) అమెరికా ఆర్మీకి సంబంధించిన పత్రికలో పనిచేశారు. ప్రత్యేకంగా పురుషుల కోసం ఉన్నతస్థాయిలో మ్యాగజైన్ ఉండాలన్న సంకల్పంతో 1953లో ప్లేబాయ్ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. 

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితుల య్యారు. తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, అండమాన్ నికోబార్ దీవులకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 1న నియమించారు. 
  • ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు.
  • అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న జగదీశ్ ముఖిని పురోహిత్ స్థానంలో అసోం గవర్నర్‌గా నియమించారు.
  • బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ మాలిక్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు.
  • బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గంగా ప్రసాద్.. మేఘాలయ గవర్నర్‌గా, ఎన్‌ఎస్‌జీలో పని చేసిన రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, నేవీ స్టాఫ్ అడ్మైరల్ మాజీ చీఫ్ దేవేంద్ర కుమార్ జోషి.. అండమాన్, నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
బన్వారీలాల్ పురోహిత్: మహారాష్ట్రలోని విదర్భకు చెందిన వ్యక్తి. సామాజిక, రాజకీయ, విద్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలుగా క్రీయాశీలకంగా ఉన్నారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో నాగ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన ‘ది హితవాద’ ఇంగ్లిష్ దినపత్రికను పునరుద్ధరించారు.
సత్యపాల్ మాలిక్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 1990 ఏప్రిల్ 21 నుంచి 1990 నవంబర్ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్ గవర్నర్ పదవి ఈయనకు వరించింది. 
గంగా ప్రసాద్: 1994లో బిహార్ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నికయ్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు.
జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు.
దేవేంద్ర కుమార్ జోషి: 1974 ఏప్రిల్ 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్‌‌స అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్ స్టాఫ్ చీఫ్‌గా చేశారు. ఐఎన్‌ఎస్ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం అందుకున్నారు.
బీడీ మిశ్రా: ఎన్‌ఎస్‌జీ (బ్లాక్ కాట్ కమాండోస్) కౌంటర్ హైజాక్ టాస్క్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్ టైస్ట్ ఆపరేషన్‌‌సలో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. 

డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డెరైక్టర్‌గా సౌమ్య ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ కూతురు సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యక్రమాల అమలు విభాగానికి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (డీడీపీ-డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్)గా నియమితులయ్యారు. ఈ పదవి డబ్ల్యూహెచ్‌వోలో రెండో అత్యున్నతమైనది కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణురాలు అయిన సౌమ్య క్షయ నిర్మూలనపై చేసిన పరిశోధనలతో గుర్తింపు పొందారు. గతంలో ఆమె చెన్నైలోని జాతీయ క్షయ పరిశోధనా సంస్థలో డెరైక్టర్‌గా పనిచేశారు. 

మధుకోడాపై ఈసీ మూడేళ్ల నిషేధంజార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ఎన్నికల సంఘం సెప్టెంబర్ 27న అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. ఎన్నికల ఖర్చులపై సరైన వివరాలు ఇవ్వని కారణంగా ఈ చర్యలు తీసుకుంది. మధుకోడా జార్ఖండ్ సీఎంగా 2006 నుంచి 2008 వరకు పనిచేశారు.

జానపద కళాకారుడు తండ భిక్షంకన్నుమూతపాచీన కళారూపమైన తెర చీరల పండితుడు, జానపద కళాకారుడు తండ భిక్షం (101) అక్టోబర్ 1న మరణించారు. ఆయన.. కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. పలు తాళపత్ర గ్రంథాలు రాశారు. తెర చీరల ప్రదర్శనకు పేరు తెచ్చారు. 

బాలీవుడ్ నటుడు టామ్ ఆల్టర్ కన్నుమూతప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ ఆల్టర్ (67).. సెప్టెంబర్ 29న ముంబైలో కన్నుమూశారు. అమెరికా సంతతికి చెందిన ఆయన ఇండియా షోబిజ్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

సూకీ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదా ఉపసంహరణ మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీకి గతంలో ప్రదానం చేసిన ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్ హోదాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ అక్టోబర్ 2న ప్రకటించింది. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడుల పట్ల ఆమె స్పందన సరిగ్గా లేదని పేర్కొన్న సంస్థ.. ఈ మేరకు గౌరవ హోదాను ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించింది. 
మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం అంగ్‌సాన్ సూకీ చేసిన పోరాటానికి గుర్తింపుగా ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ ఆమెకు 1997లో ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదాను ప్రదానం చేసింది.